Friday, April 8, 2011

నా ప్రేమ కధ

అమ్మాయిని  "ఓ రేంజ్"  లో చూడటమే కానీ అమ్మాయిని అమ్మాయిల  చూసింది అప్పుడే 


నా డిగ్రీ వరకు మా తాతయ్య  ఇంటిదగ్గరే చదువుకున్నాను .... నేను M.B.A చదవడానికి మా ఊరు వెళ్తున్నాను ఆ రోజు , ఆ రోజు నాకు ఇప్పడికి నాకు బాగా గుర్తు . ఒంటరిగా సాగుతున్న నా ప్రయాణం లో కాస్తా జరుగుతార అంటూ వచ్చింది తను . అప్పడివరకు చాల మందిని ప్రేమించాను అనే కంటే చాలామందిని ట్రై చేయసాను అంటే బాగుంటుంది. అమ్మాయని చుస్తే మరీ ఓ రేంజ్   ఫిగర్ లా కనిపించలేదు నాకు .. నాకు అప్పటివరకు అమ్మాయిని  'ఓ రేంజ్ "  లో చూడటమే కానీ అమ్మాయిని అమ్మాయిల  చూసింది అప్పుడే ...

మీరు ఎక్కడికి వెళ్తారు? అని అడిగాను.. చాలనేమ్మదిగా పేస్ నావైపు తిప్పి మీకు ఏందుకు అనిఅడిగింది తను.. నిజంగా ఆమాటకు నేను ఫ్లాట్ అయ్యాను.. నేను ఆమాటకు అన్ని మూసుకుని 93.5FM వింటూ కూర్చున్న .. ఇద్దరం ఒకే స్టేషన్ లో దిగాం, తను ముందు నడుస్తుంది తనవేనుకే hutch కుక్కలా నడవడం స్టార్ట్ చేశాను ..ఓరే అంటూ పిలుపు వెనకవైపునుంచి ... నేనే రా.. శ్రీనుని అంటూ పలకరించాడు నా ఫ్రెండ్ . వాడితో మాట్లాడుతూ ఉంటె అంతలోనే కనబడకుండా వెళ్ళిపోయింది తను. lite లే అనుకుంటూ ఇంటికి వెళ్ళాను . అంతమమోలె గా ఇంటిదగ్గర ఆ పలకరింపులు.

సాయంత్రం మా ఫ్రెండ్స్ అందరు పండగ చేసుకున్నాం ... ప్రతివాడు తనప్రేమ కధలను చెప్పడం మొదలు పెట్టారు.3days  "కాలేజీ జోయిన్ అవడం- బస్సు పాస్ లు " పని గడిచిపోయాయి. F.M వింటూ మేడపైన తిరుగుతూ  అమ్మాయిల వేట మొదలుపెట్టాను .
అప్పుడే అర్దమైంది నాకు "చంకలో మేకను పెట్టుకుని ఊరంతా వెతకడం అంటే" మా ఎదురింటి లోనే దర్శనం ఇచ్చింది ఆ బస్సు లోని  అమ్మాయే .. ఇంకేముంది సగం జీవితం మేడపైనే నాది అనుకున్నాను.. ఒకరోజు తను నా దగ్గరకి వచ్చి పరిచయం చేసుకుంది తను చెప్తున్నామాటలలో నేను B.Sc 2nd year  చదువుతున్నాను అనే మాటే వినబడింది ... తను వెళ్తూ మీరు మెడపైనుంచి నన్ను చూడటం అమ్మ చూసి నాకు క్లాసు ఇచ్చింది ..so మీరు ఇంకా ఆపితే బాగుంటుంది అని చెప్పింది . తన మాట  నాకు వినడం తప్ప మాటలురాలేదు అప్పుడు.

ఇంకా F.M వినడం ఇంట్లోనే ... మాకు క్లాసు లు స్టార్ట్ అయ్యాయి .. తను బస్సు లో కనిపించిది, నేను మాట్లాడలేదు తనతో .. తరవాతి రోజు తనే మాట్లాడింది .. థాంక్స్ కూడా చెప్పింది.. ఇంకా నేను స్టార్ట్ చేశాను తనతో మాట్లాడడం ఇంకా ఆపలేనంతగా ..
ఒక్కరోజు కూడా బస్సు మిస్ అవలేదు నేను .. తను చాల చక్కగా మాట్లాడేది, అందరికి ప్రేమించిన అమ్మాయ్ లు మాటలు అలాగే వినబడతాయ్ కదా అనిపించింది. రోజులు అన్ని సరదాగా- నేను ఎప్పుడు చుడనివిగా సాగుతున్నాయ్..

ఒకరోజు బస్సు లో నాతో మాట్లాడకుండా మౌనంగా కుర్చుని ఉంది. పిలిచిన వినబడనట్టు నటించింది. నాకేం అర్ధం కాలేదు అప్పుడు.. తరువాత తెలిసింది ఆ రోజు వాళ్ళ తమ్ముడు చదువుకోవడానికి వేరే ఊరు వెళ్తున్నాడని, తరువాత కలిసాను తనని నేను .. అప్పుడు చెప్తూ ఏడవడం మొదలుపెట్టింది నాకేం చేయాలో అర్ధం కాలేదు , కాని అప్పుడే decide అయ్యా .. నేను పెళ్లి  చేసుకోబోయే అమ్మాయ్ తననేనని. ఏదో విదంగా తన  మూడ్ మార్చి మాట్లాడం మొదలపెట్టాను ..

నా బర్త్డే నాడు నాకో వాచ్ ఇచ్చింది .. నీకు ఏలా తెలుసు ఈ రోజు నా బర్త్డే అని అడిగాను .. కావలిసినవాళ్ళ గురించి అన్ని విషియాలు ఏదోలా తెలుస్తాయ్ అని  చెప్పింది. ఆ రోజే i love you అని చెప్పాలని అనుకున్నాను, ఏదో తెలియని భయం కలిగింది నాకు ... ఒకే లే అప్పుడే తొందర ఏందుకు  అని సర్దిచెప్పుకున్నాను...


రోజులు అన్ని సరదాగా మాటలతో అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలతో పోతున్నాయ్.. నాది M.B.A 1st Year కూడా అయిపొయింది. మరీ లేట్ చేయడం మంచిది కాదేమో అనుకున్నాను ... ఒక రోజు నైట్ నిద్రమాని మరీ ఆలోచించాను i love you చెప్పాలా వద్దా అనికాదు ... ఏలా చెప్పాలానీ ... సినిమా లో హీరో లు చెప్పే రేంజ్ లో చెప్పలా ? లేకపోతె మన లెవెల్ లో చెప్పాలా ? ఒక వేల చెప్పిన తరవాత తను ఏమంటుందో ... ఒకవేళ నో అంటే ... తనతో పాటు తన ఫ్రెండ్ షిప్ కూడా దక్కకుండా పోతుందేమో అనే డౌట్ ... తను నో అన్నా తన  ఫ్రెండ్ షిప్ మాత్రం పోకుండా తనకి నేను i love you చెప్పాలి. అప్పుడే 4 అయిపొయింది టైం .మార్నింగ్ లేచి గురువారం కాబట్టి తనకి సాయిబాబా అంటే ఇష్టం ఎలాగో గుడికి వెళ్తుంది మనం అక్కడే ప్రపోజ్ చేస్తే మంచిదని పడుకున్నాను .........


పడుకోవడం ఐతే పడుకున్నాను  కాని నిద్ర ఏక్కడ పట్టిందీ... మంచి డ్రెస్ వేసుకుని గుడుకి బయలదేరాను .. ఉదయాన్నే గుడుకి వెళ్ళడం చూసి మా నాన్న  అనుమానంగా చూసారు .. లైట్ అనుకుని గుడిదగ్గర తనకోసం ఎదురుచూస్తున్నా .. చక్కగా ఉంది తను ఆ డ్రెస్ లో .. అప్పడివరకు శరీరం బాగానే ఉంది కాని ఏదో తెలియని ఫీలింగ్ కొంచెం భయం గా ఉంది కాని నేను దైర్యంగా చెప్పడం మొదలుపెట్టాను మరీ i love u అంటే భయపడుతుందని కాస్తా అవి ఇవి చెప్తూ మాటలమద్యలో " ఒకవేళ నీకు నేను i love you చెప్తే నా మిద ఉన్న మంచి అభిప్రాయం పోతుందా నీకు " అన్నాను .. ఈ ఆడవాళ్లు అందరు ఇంతేననుకుంటా ఎస్/నో  చెప్పకుండా మీకు మాకు చాలాదూరం ఉంది అని చెప్పి వెళ్లి పోయింది. ఇంతకీ అన్ని స్టొరీ లో లాగే మా స్టొరీ కూడా " మా ఇద్దరి కులాలు వేరు, తను కొంచెం పూర్"

నేను తనని వదలలేదు ఆన్సర్ చెప్పెంతవరకు .. తను చెప్పింది నువ్వు అంటే నాకు ఇష్టమే కాని ... ఐన వద్దు .. మనం ఫ్రెండ్స్ గానే ఉందాం అంది. నేను చేప్పాను తనకి ఏం జరిగినా నేను మాత్రం నీ చెయ్యి వదిలేది లేదని.. ఎదోవిదంగా తనని ఒప్పించాగాలిగాను .. తనకు బాగా ముందు చూపు ఏక్కువ .. మేం ఏం మాట్లాడుకున్న నువ్వు మాత్రం బాగా చదువు అంటూ చెప్పేది.. తను ఏందుకు చెప్తుందో నాకు తెలుసు... మొత్తం మీద మా స్టొరీ మా ఇద్దరింటి దగ్గర తెలిసి పోయింది. ఇంకేం ఉంది గొడవ , గోల , గందరిగోళం.

నా  M.B.A పూర్తయింది... జాబు కోసం వేట మొదలుపెట్టాను .. 12K శాలరీ తో జాబు దొరికింది. ఒకరోజు తనకి ఫోన్ చేశాను .. తన గొంతు లోంచి .. మాటలు రావడం లేదు ఏడుస్తున్నట్టు శబ్దం.. ఏం అయింది చెప్పు  ఏం అయింది అంటూ అడిగాను ..తను నాతో " ఈ రోజు మా అమ్మ గారి తో చేప్పాను అమ్మ ఓకే అంది, నాన్న మాత్రం అసలు ఒప్పుకోలేదు .. నన్ను కొట్టలేక అమ్మ మీద చెయ్యి చేసుకున్నారు.. త్వరలోనే నీకు పెళ్లి చేస్తాను .. నువ్వు చేసుకోకపోతే నేను చనిపోవడమో .. నిన్ను చంపడమో జరుగుతుంది. అని చెప్పి కోపంగా వెళ్ళిపోయారు ... అసలు నువ్వు నాకు ఏందుకు పరిచయం అయ్యావ్ అసలు .. నిజం చెప్తున్నాను నిన్ను తప్ప నేను వేరే పెళ్లి చేసుకునే ఛాన్స్ లేదు ... వేరేవాళ్ళతో పెళ్లి జరిగింది అంటే వెంటనే నేను చావడం మాత్రం కాయం." అని చెప్పి ఏడవడం స్టార్ట్ చేసింది...... నేను చేప్పాను తనకి నువ్వు లేక పొతే నేను మాత్రం ఏలా ఉంటాను అనుకున్నావ్.. నువ్వు ఏం తొందరపడకు అంత నేను చూసుకుంటాను ... అని తనకు దైర్యం చెప్పనోలేదోకాని ..నాకు మాత్రం తను దైర్యంగా వాళ్ళ నాన్నతో చెప్పండం నాకు నచ్చింది.

నేను ఏదికావాలన్న మా అమ్మని అడుగుతాను , నాన్న గారితో మాట్లాడమే  భయం నాకు కాని ఈ విషయం లో నాన్న గారితోనే స్టార్ట్ చేద్దాం అనిపించింది... నాకు ఇంటిదగ్గర చెప్పకుండా లేచి పోవడం -- పెళ్లి చేసికోవడం అంటే అసలు ఇష్టం లేదు , నాకే కాదు తనకి కూడా అంతే అందుకే ఇది అంత. నిజంగా మేము ఇద్దరం లేచిపోదాం అనుకునివుంటే ఎప్పుడో మా పెళ్లి అయిపోయి ఉండేది.
నేను నాన్నగారి తో చెప్పడానికి ఎక్కడలేని దైర్యని ఇచ్చింది మాత్రం తనే ఆ రోజు తను ఏడ్చినా శబ్దం  నా చెవిలో అలేనే ఉండిపోయింది, నాన్నగారితో దైర్యం చేసి చేప్పాను అప్పడివరకు ప్రశాంతంగా విన్న అయన ఒక్కసారిగా కోపంతో ఉగిపోయారు .. అయన మొఖం అంత ఎరుపు రంగులోకి మారిపోయింది.. నా మీద చెయ్య చూసుకున్నారు .. నేను కోపంతో బయటకు వెళ్ళిపోయాను ..

నేను వెళ్ళిన 30min కి నాకు ఫోన్ వచ్చింది .. మా నాన్నగారికి గుండేనొప్పి వచ్చిందని హాస్పటల్ కి తిసుకువేల్తున్నారని .. ఆ క్షణం నాకు ఏంచేయాలో తెలియలేదు .. నేను వెంటనే హాస్పటల్ కి వెళ్ళాను.. అమ్మ తమ్ముడు భయంతో ఒకములన కుర్చుని ఉన్నారు.. నాన్నగారిని ICU రూం లో ఉంచారు .. నాన్నగారికి ఫస్ట్ టైం రావడం ఇది. బందువులు అంత హాస్పటల్ కి రావడం స్టార్ట్ చేసారు వాళ్ళంతా నన్ను విలన్ లా చూసారు .. ఆరోజు నైట్ నేను హాస్పటల్ లోనే ఉన్నాను. తను నైట్ కాల్ చేసింది జరిగింది చేప్పాను.. " అంత నా వల్లే  కదా "అంటూ ఫీల్ అయింది ..అంతలోకే మామయ్య ఓరే అంటూ పిలవడం స్టార్ట్ చేసాడు .. నేను తరవాత కాల్ చేస్తాను అంటూ కాల్ కట్ చేశాను..

మా మామయ్య కాదు నాకు తెలియని బందువులు కూడా వాళ్ళకి వాళ్ళు  శ్రీ కృష్ణుడు లాగ ఫీల్ అయ్యి నాకు క్లాసు ఇవ్వడం స్టార్ట్ చేసారు .. మూడు రోజులు వరకు తనకి కాల్ చేయడానికి ఛాన్స్ లేకుండా పోయింది.. నాన్నగారిని ఇంటికి తీసుకుని వచ్చాం.. అమ్మ కూడా నాతో అవసరం ఉంటె నే మాట్లాడేది.. మొత్తం మీద తనకి కాల్ చేశాను.. "మనం వెయిట్ చేద్దాం .. వీళ్లు మారాతరేమో  చూద్దాం" అని చేప్పాను ,దానికి తనుకూడా ఓకే అంది. సుమారు 8నెలలు  వెయిట్ చేసాం మావాళ్ళు మారడం కాదు కాదా  పైగా నాకు పెళ్లి చేయడానికే చూసారు..ప్రతివాడు మాకు అమ్మాయ్ ఉంది మీవాడికి ఈడుజోడు అంటూ మా బందువులాంత ఒకరి తరవాత ఒకరు లైన్ కాట్టారు. నా చావు నేను చస్తుంటే మధ్యలో  వీళ్ళగోల ఏమిట్రా బాబు అనుకునేవాడిని.ఒక రోజు అమ్మతో దైర్యం చేసి మాట్లాడను అమ్మ నాతో ఒకే మాట చెప్పింది నీకు మాదగ్గర కంటే తనతో ఉండమే సుఖం అనుకుంటే నీ ఇష్టం .. ఒక్కమాట నువ్వు పెళ్లి చేసుకున్న తరవాత మన సంబందాలు ఇలాగే ఉంటాయని మాత్రం అనుకోకు . అంత కన్నా నేను నీకు ఏమిచేప్పలేను ఆలోచించుకో అని చెప్పింది . ఒకరోజు వాళ్ళ అమ్మగారితో మాట్లాడను అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని  కాదు మీ అమ్మాయిని తీసుకు వెళ్తున్నానని .. వాళ్ళ అమ్మగారు సరే అనే దైర్యం చేయలేక మౌనంగ ఉండిపోయారు ... మా అమ్మగారితో కూడా చేప్పాను అమ్మ నేను మౌనంగా ఉండి మీకు ఇతర ఆలోచనలు (నా పెళ్లి ) కల్పించడం నాకు ఇష్టం లేదు. నేను తనని పెళ్లి చేసుకుందామని నిర్ణయం తీసుకున్నాను అని  చేప్పాను. అమ్మ ఏమిఅనకుండా నీ ఇష్టం అన్నట్టుగా చూసి ఊరుకుంది.

నేను ౩ గంటలకి లేచి రెడీ అవుతున్నాను.. నాతో పాటే మా అమ్మకూడా నిద్రలేచి నేను వెళ్తున్న దారిని చూస్తూ జాగ్రత్త అంటూ కళ్ళతోనే దీవించింది .  మా ఆఫీసు లో నా ఫ్రెండ్ సహాయం తో నా పెళ్ళికి అంత రెడీ చేసాం... తను స్కూల్ లో టీచర్ గా పనిచేస్తుంది ఆరోజు వాళ్ళ అమ్మగారు బస్సు స్టాండ్ వరకు వచ్చి బస్సు ఎక్కించి  వెళ్లారు... మీకు చెప్పలేదు గా నా పెళ్ళికి నా ఫ్రెండ్స్ కి invitation cards కూడా ఇచ్చాను.. మా ఇంటిదగ్గర  ముహూర్తం టైం కూడా చేప్పాను... వెంకటేశ్వర స్వామి గుడిలో మా పెళ్ళికి అంత రెడీ చేసాం.. అమ్మ నాన్న .. అత్తా  మామ ఎవరులేకుండానే మా వివాహం జరిగింది.. తనకి తాళి కట్టేంతవరకు తను మొఖం లో చిరునవ్వు లేదు.... ఆ క్షణాలు  ఏప్పటికి మరిచిపోలేనివి.

ఎనిమిది నెలల తరువాత ప్రశాంతంగా ఉన్నది ఆ రోజేనేను... మా ఆఫీసు వాళ్ళు మాకు గిఫ్ట్ గా వంట సామాన్లు ఇచ్చారు.... తరువాత చాలాసార్లు ఇంటికి కాల్ చేశాను వాళ్ళు లిఫ్ట్ చేయలేదు..మా పెళ్లి అయిన నెలరోజుల తరవాత ఒకరోజు నేను గుడికి వెళ్లి వచ్చాను అప్పుడు సెల్ రింగ్ అయింది ఇంటి దగ్గరనుంచి అమ్మ కాల్ చేస్తుంది ఎక్కడలేని ఆనదం కలిగింది. అమ్మ ఫోన్ లో నేను మీ నాన్నగారు మిమ్మల్ని చూడ్డనికి వద్దమానుకుంటున్నాం నువ్వు ఏమంటావ్ రా అంది..... అలాగే అమ్మ అనే మాటకంటే నాకు ఏమిరాలేదు..


అమ్మ. నాన్న .. మా ఇంటికి వచ్చారు మా అమ్మ నా భార్య తో "చూడమ్మా నేను నిన్ను మా అబ్బాయ్ భార్యగానే చూడగలను అంతే  నువ్వు కూడా మా అబ్బాయ్ భార్య గానే మా ఇంటికికుడా రావచ్చు అంతే కాని నేను మీ అమ్మ నాన్న లతో మాట్లాడడం కాని మేము మీ ఇంటికి రావడం కాని జరగదు .. నువ్వు కూడా మివాళ్ళ విషయాలను మాదగ్గర ప్రస్తావన తీసుకురావద్దు .. అలాగే మా విషియాలను కూడా మీ వాళ్ళ దగ్గర ప్రస్తావన తీసుకు రావద్దు." మేము ఇంతకన్నా దిగిరావడం  కష్టం నువ్వు అర్ధం చేసుకుంటావని అనుకుంటున్నాను అంది.. నా భార్య అర్దమయి కానట్టుగా తలూపి ఊరుకుంది.

అక్కడనుంచి మేము మా అమ్మగారింటి వెళ్ళడం మొదలు పెట్టాము.. మాకు ఒక అబ్బాయ్ కూడా పుట్టాడు. అక్కనుంచి మొదలైంది అసలు కధ" మా అత్తగారు .. మా అమ్మగారు" కలవారు కాబట్టి వాడికి మా అత్తగారి ఇంటిదగ్గర పుట్టినరోజు వేడుకలు మళ్ళి మా అమ్మగారి ఇంటిదగ్గర పుట్టినరోజు . ఒక చోట పేదవాడి వేషం లో మరొక చోట ఉన్నవాడి వేషం లో మా వాడు నటించడం అప్పుడే స్టార్ట్ చేసేసాడు.......

---- ఎలాఉంది స్టొరీ ?